నవతెలంగాణ -ముధోల్
ముధోల్ మండలంలోని రాంటేక్, వెంకటాపుర్, పిప్రి గ్రామాలలో రేపటినుండి గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ముధోల్ మండల తహశీల్దార్ శ్రీలత మంగళవారం ఒక్క ప్రకటనలో తెలిపారు. ఈ గ్రామ సభలో పెరల్స్ భూముల సమస్యలు, నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలు, రైతుల అభ్యర్థనలు ఫిర్యాదుల స్వీకరణ కొరకు గ్రామ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు తమ భూ పత్రాలతో హాజరుకావాలని సూచించారు. 7న రాంటేక్, 8న వెంకటాపూర్, 9న పిప్రి గ్రామంలో గ్రామసభలు ఉంటాయని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.






కామెంట్లు (0)