Magazines

ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌ కోచ్‌గా గంగూలీ

58 నిమిషాల క్రితం

Ganguly appointed as Delhi Capitals head coach
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : 2027 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ కోసం భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మంగళవారం 'దిల్లీ క్యాపిటల్స్' ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. 2019లో సలహాదారుగా ఈ ఫ్రాంచైజీలో చేరడంతో గంగూలీకి దిల్లీ క్యాపిటల్స్‌తో అనుబంధం మొదలైంది. గత కొన్నేళ్లుగా ఈ జట్టులో పురుషులు, మహిళల జట్లకు 'డైరెక్టర్ ఆఫ్ క్రికెట్'తో సహా పలు కీలక నాయకత్వ బాధ్యతలు నిర్వహించారు. "ఐపీఎల్‌లో ప్రధాన కోచ్ బాధ్యతను చేపట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని ఫ్రాంచైజీ విడుదల చేసిన ప్రకటనలో గంగూలీ పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్