- 15న ఎంపీడీఓ కార్యాలయం వద్ద 'ఓపెన్ ఫోరం'
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మండలంలోని 21 గ్రామ పంచాయతీలలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎంజీఎన్ఆర్ఈజీఏ) పథకం 18వ విడత సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. మొదటి విడతలో భాగంగా రేగళ్లపాడు, రామగోవిందాపురం, యాతాలకుంట, నారాయణపురం, సదాశివునిపాలెం, బుగ్గపాడు, రామానగరం, రేజర్ల, రుద్రాక్షపల్లి, సిద్ధారం, కిష్టాపురం, గంగారం గ్రామ పంచాయతీలలో సోషల్ ఆడిట్ బృందాలు తనిఖీ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ నెల 14వ తేదీ నాటికి అన్ని గ్రామ పంచాయతీలలో తనిఖీలతో పాటు గ్రామ సభల నిర్వహణను పూర్తి చేయడం జరుగుతుంది. అనంతరం అక్టోబర్ 15న సత్తుపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజా సమక్షంలో 'ఓపెన్ ఫోరం' నిర్వహించనున్నట్లు ఎంపీడీవో కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.






కామెంట్‌లు (0)