Magazines

చిత్రకారుడు పల్లం పిచ్చయ్యకు చిత్రలేఖన పోటీల్లో ద్వితీయ బహుమతి

59 నిమిషాల క్రితం

Pichaiyya
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

- అభినందించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 

నవతెలంగాణ-సత్తుపల్లి 

​ఒంగోలు పట్టణ 150 వసంతాల వేడుకల సందర్భంగా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహించిన చిత్రలేఖన పోటీలలో సత్తుపల్లికి చెందిన ప్రముఖ చిత్రకారుడు పల్లం పిచ్చయ్య ద్వితీయ బహుమతి గెలుపొందారు. ఒంగోలు ప్రాంత ప్రముఖ వ్యక్తులు, వారసత్వ సంపద, సంస్కృతి సంప్రదాయాల సమ్మేళనంగా ఆయన గీసిన అత్యద్భుత చిత్రానికి ఈ పురస్కారం లభించింది. సోమవారం ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో పిచ్చయ్య రూ.10వేల  నగదు బహుమతిని అందుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. చిత్రలేఖన రంగంలో సత్తుపల్లి కీర్తిని చాటిన పిచ్చయ్యను సృజన సాహితీ సమాఖ్య  సభ్యులు, స్థానికులు అభినందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్