నవతెలంగాణ - భీంగల్
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భీంగల్ లో ఆదివారం సైకిల్ యాత్ర సన్నాహక యాత్ర సమావేశం నిర్వహించారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రైతుల రుణ మాపి పూర్తిగా చేయలేదు. 500 బోనస్ అందరికి ఇవ్వలేదు. రైతు బీమా చేయడంలో విఫలం అయ్యింది. వడ్ల కొనుగోలు ముందస్తు చర్యలలో విఫలం. ఉద్దేశంతో ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లు తెరువాలని ఈ యాత్ర ఎంపీ ఆదేశాల మేరకు చేపట్టడం జరిగిందని తెలిపారు. వడ్లు కోతలు చాలు అయినంక దళారుల చేతుల్లో పడకుండా రైతులు పంట కోసిన వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని గత ఎనిమిది రోజులుగా కిషన్ మోర్చా బీజేపీ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో చేస్తున్నాటివంటి సైకిల్ యాత్ర బడా భీంగల్ నుండి భీంగల్ చేరుకోవడం జరిగింది.
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గత ఎనిమిది రోజుల నుంచి సైకిల్‌యాత్ర కొనసాగుతుందని భీంగల్ బిజెపి నాయకులు తెలిపారు. ఇట్టి యాత్ర భీంగల్ వాగు దగ్గర గుడి దగ్గర రిసీవ్ చేసుకొని బోదిరే గల్లీ నుండి బడా భీంగల్ రోడ్ గుండా మొత్తం 50 మంది రైతులతో బస్టాండ్ నుండి పురాని పేట్ చేరుకోవటం జరిగింది. భోజనం అనంతరం జాగీర్యాల్ నుండి సాయంత్రం మోర్తాడ్ చేరుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం లో బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర నర్సయ్య కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు నీలం గంగాధర్ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి, మండల అధ్యక్షులు అరె రవీందర్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు తోట నీచ్చ మొల్ల నవీన్, గంగాధర్, ప్రేమ్ చందు, కుప్కాల్ సర్పంచ్ నర్సింగ్ రావు, గోపు సంజయ్, కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)