Magazines

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

2 గంటల క్రితం

brs to congress
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - భీంగల్ 
భీంగల్ పట్టణ కేంద్రంలోని 10వ వార్డుకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుని కాంగ్రెస్ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో సంటివిగ్నేష్, గడ్డం సిద్దు, దుమాల రాకేష్, బోదపల్లి జయరాజ్, చెప్పల పోషణ, చింతలూరు సంతోష్, దుమాల శ్రీకాంత్, చింతలూరి సుబ్బు, చింతలూరి మిదిలేష్, చింతలూరు అర్షిత్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ముత్యాల సునీల్ కుమార్ వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్