నవతెలంగాణ-మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలో బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ 9వ వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి కంపెనీ ఉద్యోగులు, కార్మికులకు ఇటీవల క్రీడలు నిర్వహించారు. ఆయా క్రీడలు విభాల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు.
కంపెనీ లో జరుగుతున్న డ్యూటీ పట్ల సేఫ్టీ, డ్యూటీకి సంబంధించి అందరూ జాగ్రత్తగా పనులు చేయాలని వైస్ ప్రెసిడెంట్ కెఎస్ఎన్ మూర్తి సూచించారు. సభను ఉద్దేశించి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు సేఫ్టీ, క్రమశిక్షణతో పనులు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సేఫ్టీ ఆఫీసర్ సురేష్ బాబు, హెచ్ ఆర్ డిహెచ్ఎం రమేష్ బాబు, అధిక సంఖ్యలో ఉద్యోగస్తులు, కార్మికులు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)