- వెంకటమ్మ చిత్రపటానికి జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పుష్పాంజలి
నవతెలంగాణ - అశ్వారావుపేట
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్యను సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా నాయకులు బుధవారం పరామర్శించారు. పుల్లయ్య తల్లి వెంకటమ్మ వయోభారంతో శనివారం మృతి చెందగా, ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో పుల్లయ్యను కలిసి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, వై. విక్రం, జబ్బార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు అన్నవరపు కనకయ్య, సత్యనారాయణ, పామాయిల్ రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఆలపాటి రామచంద్ర ప్రసాద్, బీఆర్ఎస్ నాయకులు పైడి వెంకటేశ్వరరావు, కేదాసి వెంకట సత్యనారాయణ (కేవీ), తాండ్ర రామారావు, అశ్వారావుపేట నాయకులు జేకేవీ రమణారావు, సంకా ప్రసాద్, శీమకుర్తి వెంకటేశ్వరరావు తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు. పలువురు సర్పంచులు కూడా పుల్లయ్యను పరామర్శించారు. అనంతరం వెంకటమ్మ చిత్రపటానికి నున్నా నాగేశ్వరరావు తదితరులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.






కామెంట్లు (0)