- మంత్రి తుమ్మలను ఆహ్వానించిన ఆర్యవైశ్య సంఘ నాయకులు
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి పట్టణంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈనెల 29న (ఆదివారం) అదే మండప ప్రాంగణంలో రజతోత్సవ (సిల్వర్ జూబ్లీ) వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరుతూ ఆర్యవైశ్య సంఘ నాయకులు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆహ్వానించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గండుగులపల్లిలోని మంత్రి నివాసానికి వెళ్లిన ఆర్యవైశ్య నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ సభ్యులు గుడిమెట్ల గాంధీ, వనమా శ్రీనివాసదేవరావు (వాసు), నడిపల్లి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.





కామెంట్లు (0)