Magazines

రైతుబీమా నమోదును వేగవంతం చేయాలి: ఎంపీడీఓ

32 నిమిషాల క్రితం

Farmers' insurance
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-కుభీర్

ప్రభుత్వం చేపట్టిన రైతు బీమా పథకం గ్రామల్లో వేగవంతంగా పూర్తి చేయాలని మండల ఎంపీడీఓ భూమరావు అన్నారు. శుక్రవారం మండలంలోని చాత, పార్డి (బి ), విరేగాం మార్లగొండ గ్రామాల్లో కొనసాగుతున్న రైతు బీమా కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. కుటుంబంలోని వ్యక్తి ఏదైనా అనివార్య కారణాల వల్ల మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా నగదు అందుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు గ్రామ పంచాయతీ కార్యాలయాలలో బీమా నమోదు చేసుకుని లబ్ది పొందాలని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచులు మడి ప్రవీణ్, జాజుల దేవేందర్, రాథోడ్ సురేష్, దేవేందర్ శ్యామరావు పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్