Magazines

డిసెంబర్‌ 15 నుంచి ఆశా వర్కర్ల సమ్మె: సీఐటీయూ

51 నిమిషాల క్రితం

strike from December 15
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

- హామీల అమలులో ప్రభుత్వాల నిర్లక్ష్యం

- రూ.18 వేల వేతనం, రూ.50 లక్షల బీమా కల్పించాలని సీఐటీయూ డిమాండ్‌

నవతెలంగాణ - అశ్వారావుపేట

గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎన్నిసార్లు అధికారులకు, మంత్రులకు విన్నవించినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో డిసెంబర్‌ 15 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు సీఐటీయూ అనుబంధ ఆశా వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు కనితి భారతి తెలిపారు. 


ఈ మేరకు మంగళవారం వినాయకపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ పూర్ణచంద్రరావుకు సమ్మె నోటీసు అందజేశారు.

ఈ సందర్భంగా భారతి మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణలో ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలను అనేక అంతర్జాతీయ సంస్థలు ప్రశంసిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల వేతనం చెల్లించాలని, రూ.50 లక్షల జీవిత బీమా కల్పించాలని, మట్టి ఖర్చుల నిమిత్తం రూ.50 వేలు అందించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో రత్న కుమారి, తిరుపతమ్మ, నాగమణి, చిలక,మంగ,విజయలక్ష్మి, సుభాని తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్