నవతెలంగాణ-హైదరాబాద్: కనీస నెలసరి వేతనాలను గణనీయంగా పెంచాలని డిమాండ్ చేస్తూ వస్త్ర కార్మికులు నాలుగు రోజుల నుంచి నిరసనలు చేస్తున్నారు. ప్రస్తుత కనీస వేతనం 12,500 టాకాలు(బంగ్లాదేశీ కరెన్సీలు) (BDT)గా ఉంది, అయితే కార్మికులు దీనిని 30,000 బంగ్లాదేశీ టాకాలకు (BDT) పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మంగళవారం ఢాకాలోని మీర్పూర్ ప్రాంతంలో వస్త్ర కార్మికులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు బాష్పవాయువు, లాఠీచార్జికి పాల్పడ్డారు. ఉదయం పలు వస్త్ర కర్మాగారాలు, ముఖ్యంగా మీర్పూర్లో, పాక్షికంగా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడంతో, కార్మికులు తమ కార్యాలయాలకు తిరిగి రావడం మొదలైన కొన్ని గంటల తర్వాత ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
అయితే, కార్మికులు కర్మాగారాల నుండి బయటకు వచ్చి వీధుల్లోకి రావడంతో ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకోవలసి వచ్చింది. నిరసనకారులను చెదరగొట్టి, శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి భద్రతా సిబ్బంది బాష్పవాయువు, లాఠీచార్జిని ఉపయోగించారు. ప్రస్తుతం పరిస్థితి దాదాపుగా అదుపులోకి వచ్చింది, పోలీసు సిబ్బంది ఆ ప్రాంతంలో గస్తీ కొనసాగిస్తున్నారు.






కామెంట్లు (0)