Magazines

మృతి చెందిన బాలింత కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలి

49 నిమిషాల క్రితం

compensation
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

చావుకు కారణమైన డాక్టర్ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికెట్ రద్దు చేయాలి

నవతెలంగాణ-అచ్చంపేట
వైద్యం వికటించి మృతి చెందిన బాలింత కుటుంబానికి 50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని, చావుకు కారణమైన డాక్టర్ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికెట్ రద్దు చేయాలని  బీసీ,ఎస్సీ,ఎస్టీ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా కోఆర్డినేటర్ సాయి మహారాజ్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేశారు ఈ సందర్భంగా సాయి మహారాజ్ మాట్లాడారు 

 ప్రసవం జరిగిన మహిళకు వైద్యం అందించడంలో డాక్టర్ నిర్లక్ష్యం వహించారని ఆవేదన వ్యక్తం చేశారు.


గతంలో ఇదే ఆసుపత్రిలో ఓ శిశువు మృతి చెందిందని ఆసుపత్రిని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. పట్టణంలో వంద పడకల ఆసుపత్రిని నిర్మాణం చేసినప్పటికీ వైద్యులను నియమించడంలో పాలకులు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని, దీంతో పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని  అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు ప్రైవేటు ఆసుపత్రులు నిర్వహించకుండా ప్రభుత్వం కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అచ్చంపేట లో ఏడాదికి ఏదైనా ఒక ప్రైవేటు  ఆసుపత్రిలో బాలింత కానీ, శిశువు కానీ చనిపోవడం సర్వసాధారణమైందని గుర్తు చేశారు.

 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్