Magazines

ఎంకేఎఫ్ ట్రస్టు ఆర్థిక సహాయం అందజేత

1 గంట క్రితం

MKF Trust
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - భీంగల్ 
భీంగల్ మండలం పురాణి పేట్ గ్రామానికి చెందిన మగ్గిడి గణేష్ కుమార్తె హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో మంగళవారం వారి కుటుంబానికి అండగా నిలుస్తూ ఎంకేఎఫ్ ట్రస్టు (MKF Trust) ద్వారా రూ.50,000 ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది.


ఈ ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును భీంగల్ మున్సిపల్ 9వార్డు కౌన్సిలర్ నీలాం రవి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. కష్టకాలంలో ఆపన్నులకు అండగా నిలవడం, నిరుపేద కుటుంబాలకు భరోసా కల్పించడం, ఆపదలో ఉన్నవారికి చేతనైన సహాయం చేయడమే ఎంకేఎఫ్ ట్రస్టు ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమంలో ఎంకేఎఫ్ ట్రస్టు ఫౌండర్ రవితేజ పటేల్, ట్రస్టు సభ్యులు మనీష్, కర్క అజయ్, కాశర్ల భార్గవ్,కర్నే నరేష్ పాల్గొన్నారు.

సేవే లక్ష్యం… మానవత్వమే మార్గం…ఒకరి కష్టంలో తోడుగా నిలవడమే నిజమైన సేవ!.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్