Magazines

మెడికల్ ఆఫీసర్ కు సమ్మె నోటీసు అందజేత

55 నిమిషాల క్రితం

Strike notice
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-కడ్తాల్ 

ఆశావర్కర్లకు కనీస వేతనం రూ. 18000/- ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పెంటయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించాలని కోరారు. లేనయెడల సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇందులో భాగంగా మంగళవారం మైసిగండి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ కుమార్ కు ఆశావర్కర్లతో కలిసి సమ్మెకు సంబంధించిన నోటీసులు అందజేశారు. కార్యక్రమంలో ఆశ వర్కర్ల మండల అధ్యక్షురాలు జ్యోతి, ప్రధాన కార్యదర్శి లావణ్య, కోశాధికారి సబిత, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్