నవతెలంగాణ-మర్రిగూడ
పలు శాఖలకు సంబంధించి నిధుల దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో మర్రిగూడ ఎంపీడీవో జిసి మున్నయ్య పై మంగళవారం డిపిఓ తరుణ్ చక్రవర్తి విచారణ చేపట్టారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సమక్షంలో పలు శాఖలకు సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలు, ప్రజా పాలన,వార్డు సభ్యులకు శిక్షణ తరగతుల సందర్భంగా అవసరానికి మించి నిధులు ఖర్చు చేసినట్టు బిల్లులు సమర్పించడంతో కలెక్టర్ ఆదేశాలనుసారం ఎంపీడీవో పై విచారణ చేపట్టడం జరిగిందని, విచారణ నివేదికను కలెక్టర్ కు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రవికుమార్, ఆయా గ్రామాల సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)