కల్లూరి రామచంద్ర రెడ్డి
నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఆలేరు నియోజకవర్గంలోని నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యావంతులు, మేధావులు, అర్హులైన పట్టభద్రులందరూ నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్ర రెడ్డి పిలుపునిచ్చారు. ఆలేరు పట్టణంలో మంగళవారం పార్టీ ముఖ్య సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పట్టభద్రుల సమస్యలు, నిరుద్యోగుల హక్కులు, విద్యావంతుల గొంతుకను ప్రజాస్వామ్య వేదికపై వినిపించేందుకు ఓటు హక్కు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.
అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకొని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామి కావాలని కోరారు. ఈ కార్యక్రమం బీఆర్ఎస్ ప్రెసిడెంట్ పుట్ట మల్లేష్ గౌడ్, మండల సెక్రెటరీ జనరల్ రచ్చ రామ్ నరసయ్య పట్టణ సెక్రటరీ జనరల్ కుండే సంపత్ మాజీ జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ ఆడెపు బాలస్వామి మాజీ కౌన్సిలర్ బేతి రాములు. మాజీ కౌన్సిలర్ రాయపురం నరసింహులు మాజీ వార్డు సభ్యులు జింకల రామకృష్ణ యాదవ్ మాజీ సర్పంచ్ గిరిరాజు వెంకటయ్య నాగరాజు నాయకులు పాల్గొన్నారు.





కామెంట్లు (0)