Magazines

భూ రీ సర్వే ప్రక్రియను పరిశీలించిన ట్రైనీ కలెక్టర్

8 గంటల క్రితం

inspects
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మర్రిగూడ

మండలంలోని తమ్మడపల్లి గ్రామంలో జరుగుతున్న భూ రీ-సర్వే ప్రక్రియను మంగళవారం ట్రైనీ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి మర్రిగూడ తాహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు తో కలిసి పరిశీలించారు.గ్రామ శివారు భూములు, గ్రామ కంఠం భూములు,ప్రభుత్వ భూములు,రైతుల పట్టా భూములు,వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ భూముల సర్వే పురోగతిని పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూరీ సర్వే కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.


అత్యాధునిక శాటిలైట్ రోవర్ సాంకేతికతతో గ్రామంలోని ప్రతి భూమిని అత్యంత పారదర్శకంగా, కచ్చితత్వంతో రీసర్వే చేస్తున్నామని రైతులకు వివరించారు.సర్వే పూర్తయిన అనంతరం ప్రతి భూమికి ప్రత్యేకమైన ల్యాండ్ పార్సెల్ నంబర్ (ఎల్ పి ఎస్) కేటాయించనున్నట్టు చెప్పారు.రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తమ భూములకు సంబంధించిన సరైన పత్రాలు, ఆధారాలతో సర్వే బృందానికి పూర్తి సహకారం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ పాండురంగారెడ్డి, జిపిఓ గిరి, లైసెన్సుడు సర్వేయర్ రవి, గ్రామ రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్