Magazines

‘కుతకుతమనే మా రక్తం’ 
పాటతో ఉత్తేజం

1 గంట క్రితం

Suddala Ashok Teja
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

సుద్దాల అశోక్‌‌తేజ్‌ రచించిన రైతు 
యుద్ధగీతం పాట ఆవిష్కరణలో జూలకంటి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

అఖిల భారత కిసాన్‌ ‌సభ (ఏఐకేఎస్‌) 36‌వ జాతీయ మహాసభలను పురస్కరించుకుని ‘కుతకుతమనే మా రక్తం సప్పుడు వినబడతలేదా...’ అంటూ సుద్దాల అశోక్‌ ‌తేజ్‌ ‌రచించిన పాట రైతులను చైతన్యపరిచేలా, ఉత్తేజపరిచేలా ఉందని మాజీ ఎమ్మెల్యే, ఏఐకేఎస్‌ ‌జాతీయ మహాసభల ఆహ్వాన కమిటీ చైర్మెన్‌ ‌జూలకంటి రంగారెడ్డి అన్నారు. సుద్దాల అశోక్‌‌తేజ తెలుగు, హిందీ భాషల్లో రాసిన రైతు యుద్ధగీతం పాటల సీడీని మంగళవారం హైదరాబాద్‌‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జూలకంటి ఆవిష్కరించారు. భూపతి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాట రచయిత సుద్దాల అశోక్‌తేజ, ఆహ్వాన సంఘం నాయకులు ఎమ్‌‌డీ అబ్బాస్‌, టి.వీరారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్‌‌రెడ్డి, శ్రీరాంనాయక్‌, స్కైలాబ్‌‌బాబు, నారి అయిలయ్య, అరిబండి ప్రసాదరావు, ఉడత రవీందర్‌, లెల్లెల బాలకృష్ణ, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిన గడ్డమీద, నల్లగొండలో ఉత్సాహపూరిత వాతావరణంలో ఏఐకేఎస్‌ ‌జాతీయ మహాసభలను నిర్వహించబోతున్నామని తెలిపారు. మహాసభల జయప్రదానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు సుద్దాల హన్మంతు కుమారుడు అశోక్‌‌తేజ రచించిన పాటలో ఒక్కో పదం రోమాలు నిక్కపొడిచేలా, పాలకులను సూటిగా ప్రశ్నించేలా, అన్నదాతల్లో పోరాట చైతన్యం నింపేలా ఉందని కొనియాడారు. ఏఐకేఎస్‌ ‌మహాసభలకు ఇంత మంచి పాటను తెలుగు, హిందీ భాషల్లో అందించిన అశోక్‌‌తేజను అభినందించారు. వ్యవసాయ పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని రూపొందించడంలోనూ, ఢిల్లీ రైతాంగ పోరాటం సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలోనూ మోడీ సర్కారు విఫలమైందని విమర్శించారు. రైతాంగ హక్కుల కోసం పోరాటాలను తీవ్రతరం చేయబోతున్నామనీ, ఏఐకేఎస్‌ ‌జాతీయ మహాసభల్లో భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్