Magazines

నవంబర్ 15న నల్లగొండలో రైతు మహాగర్జన

1 గంట క్రితం

great roar
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

రైతుసంఘం 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

రైతులు, ప్రజలకు సీపీఐ(ఎం) నాయకుడు కల్లూరి మల్లేశం పిలుపు

నవతెలంగాణ-ఆలేరు రూరల్

నల్లగొండ జిల్లా కేంద్రంలో నవంబర్ 15 నుంచి 18 వరకు నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కల్లూరి మల్లేశం రైతులు, ప్రజలకు పిలుపునిచ్చారు.మంగళవారం ఆలేరు మండలం పటేల్‌గూడెం గ్రామంలో మహాసభల విజయవంతం కోసం నిర్వహించిన కరపత్రాల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహాసభల నిర్వహణకు పటేల్‌గూడెం రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందించడం అభినందనీయమన్నారు.


ఇదే స్ఫూర్తితో మండలంలోని అన్ని గ్రామాల రైతులు, ప్రజలు సహకరించాలని కోరారు.రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 15న నల్లగొండలో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.


ఎన్నికల సమయంలో రైతులను రాజులను చేస్తామని హామీలు ఇస్తున్న ప్రభుత్వాలు..ఆచరణలో మాత్రం రైతులకు సరైన మద్దతు ధర, మార్కెట్ సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నాయని విమర్శించారు.రైతుల భూములను కార్పొరేట్లకు అప్పగించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతాంగం ఉద్యమించి వాటిని వెనక్కి తీసుకునేలా చేసిందని గుర్తుచేశారు.అయినప్పటికీ రైతాంగ సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదని, రైతుల హక్కుల సాధన కోసం నిరంతర పోరాటాలు అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు, పటేల్‌గూడెం గ్రామ శాఖ కార్యదర్శి పిక్క గణేష్, పార్టీ నాయకులు గ్యార భాస్కర్, పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్