- నిష్పక్షపాతంగా వ్యవహరించాలి
- సర్వే సిబ్బందికి ఆర్డీవో మధుబాబు ఆదేశాలు
నవతెలంగాణ - అశ్వారావుపేట
భూ రీసర్వేలో భాగంగా రెవెన్యూ గ్రామాల సరిహద్దులను నిర్దిష్టంగా, కచ్చితత్వంతో గుర్తించాలని ఆర్డీవో మధుబాబు సర్వే సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని కన్నాయిగూడెంలో బుధవారం నిర్వహిస్తున్న భూ రీసర్వే కార్యక్రమాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సర్వే ప్రక్రియలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా నిష్పక్షపాతంగా సర్వే నిర్వహించాలని సర్వేయర్ నాగరాజుకు సూచించారు. భూ సరిహద్దుల గుర్తింపులో ఖచ్చితత్వం పాటిస్తూ, పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.







కామెంట్‌లు (0)