Magazines

మహిళను వేధిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

2 గంటల క్రితం

harassing woman
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - పరకాల

పట్టణానికి చెందిన ఓ మహిళను గత ఆరు నెలలుగా లైంగికంగా వేధిస్తూ, కత్తితో బెదిరించిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పల్లె పవన్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కొమ్ముల శ్రీనివాస్‌ వస్త్ర దుకాణంలో పనిచేసే ఓ మహిళను తరచూ అక్కడికి వెళ్ళి, తనతో సన్నిహితంగా మెలగాలనీ, లేదంటే చంపుతానంటూ కత్తితో బెదిరించేవాడు. ఆమెను మాటలతో క్ష‍ోభకు గురిచేసేవాడు. ఇదంతా ఆమె భరించలేక అక్కడ పని మానేసీ, ఓ కిరాణ దుకాణంలో పనిలో చేరింది. అయినప్పటికీ శ్రీనివాస్‌ వేధింపులు ఆపకుండా గత నెల 28న కిరాణా షాపు వద్దకు వెళ్ళి, బెదిరింపులు కొనసాగించాడు. అయితే అక్కడే ఉన్న దుకాణ యజమాని, మరికొందరు వ్యక్తులు అతన్ని మందలించడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటికే విసుగు చెందిన మహిళ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన ఎస్సై శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్