Magazines

డిజిటల్ యుగంలో 'సైబర్' భద్రతే శ్రీరామరక్ష

1 గంట క్రితం

Cyber ​​security
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం

- సైబర్ నేరాలపై అవగాహన సదస్సు, టార్చ్‌లైట్లతో ర్యాలీ

నవతెలంగాణ-సత్తుపల్లి

​నేటి సమాజంలో సాంకేతికత పెరిగిన కొద్దీ సైబర్ నేరాలు కూడా వేగంగా పెరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ వీటిపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ ఏసీపీ సీహెచ్‌ఆర్‌వీ ఫణిందర్ పిలుపునిచ్చారు. సత్తుపల్లిలోని జేవీఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో పట్టణ సీఐ తుమ్మలపల్లి శ్రీహరి ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు నిర్వహించారు.


​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ ఫణిందర్ మాట్లాడుతూ...  సెల్‌ఫోన్లు మరియు సోషల్ మీడియా వినియోగం పెరగడంతో నేరాల సరళి కూడా మారిందని తెలిపారు. ఇంటర్నెట్ వాడకం వల్ల మార్ఫింగ్, ఫైనాన్షియల్ మోసాలు, ఆన్‌లైన్ షాపింగ్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్, ఫేక్ కాల్స్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని హెచ్చరించారు. ఎటువంటి ఆర్థిక లావాదేవీల పట్ల అనుమానం కలిగినా ఒక్క క్షణం ఆగి, ఆలోచించి అడుగేయాలని సూచించారు.


ఒకవేళ సైబర్ మోసాల బారిన పడితే బాధితులు వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. సదస్సు అనంతరం కళాశాల నుంచి స్థానిక రింగ్ సెంటర్ వరకు సెల్‌ఫోన్ టార్చ్‌లైట్లు వెలిగిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ సీఐ రవికుమార్, ఎస్‌ఐలు రంజిత్ కుమార్, విజయ్ కుమార్, పట్టణ ఎస్‌ఐ వీరప్రసాద్, అశోక్, వేంసూర్ ఎస్‌ఐ ప్రదీప్, పెనుబల్లి ఎస్‌ఐ షాకీర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్