నవతెలంగాణ - తిమ్మాజిపేట
తిమ్మాజిపేట మండల కేంద్రానికి చెందిన దాచేపల్లి సారిక తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా నియమితులయ్యారు. రెండో విడత మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ విస్తరణలో భాగంగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ప్రకటించి దాచేపల్లి సారికకు నియామక పత్రం అందించారు.
ఈ సందర్భంగా దాచేపల్లి సారిక మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కోసం నిరంతరం కృషి చేస్తానని ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల ప్రజల్లోకి తీసుకువెళ్తానని తెలిపారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కుచుకుళ్ళ దామోదర్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తిమ్మాజిపేట మండల కేంద్రానికి చెందిన దాచేపల్లి సారిక తొలిసారిగా రాష్ట్ర మహిళ విభాగంలో చోటు దక్కినందుకు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, జిల్లా నాయకులు ఈ సందర్భంగా ఆమెను అభినందించారు.







కామెంట్లు (0)