నవతెలంగాణ-మల్హర్ రావు.
మండలం ఆన్ సాన్ పల్లి గ్రామాభివృద్ధిపై బిఆర్ఎస్ నాయకుడు,మాజీ సైనికుడు బానోతు రాజ్ కుమార్ అలియాసిస్ ఢిల్లీ రాజు సోమవారం భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను ప్రజావాణిలో కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో అసంపూర్తిగా పూర్తి స్థాయిలో డ్రైనేజిలు ఉండడంతో 40 సంవత్సరాల నుండి ప్రజలు వర్షాకాలంలో అనేక రకాల వ్యాధుల బారిన పడి ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. అందుకోసం పూర్తి స్థాయి డ్రైనేజి నిర్మించాలని కోరారు. పేద విద్యార్థులు చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగ అవకాశాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లి కోచింగ్ తీసుకోవడం ఇబ్బందిగా మారిందని, అందుకోసం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవడానికి గ్రంధాలయం,శారీరక దృఢత్వం కోసం యువకులకు వ్యాయమ ఆట స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.ఆటస్థలం,గ్రంధాలయం ఏర్పాటు చేయాలని,అలాగే నిరుపేద ప్రజలు ఏవైనా శుభాకార్యాలు చేసుకొనుటకు ఇబ్బందులు పడుతున్నారని,అందుకోసం కమ్యూనీటి నిర్మించాలని కోరారు. మహనీయాలు,సంఘ సంస్కర్తలు,భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్,జ్యోతి రావు పూలే,సావిత్రి బాయి పూలే,ఛత్రపతి శివాజీ,తెలంగాణ సాయుధ పోరాట యోధులు చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, బంజారా ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గార్లను స్మరించుటకొరకు వారి విగ్రహాలను ఏర్పాటు చేయుటకు స్థలం కేటాయించి,అనుమతులు ఇప్పించాలని కోరారు.







కామెంట్‌లు (0)