Magazines

సోషల్ మీడియాలో ప్రతికూల విమర్శలకు దిగులుపడొద్దు

1 గంట క్రితం

social media
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 1 నిమిషాల చదవడం

- ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్

నవతెలంగాణ-సత్తుపల్లి 

సోషల్ మీడియాలో వచ్చే ప్రతికూల విమర్శలకు దిగులుపడొద్దని, వాస్తవ సమాచారంతో ప్రజలకు అవగాహన కలిగిస్తూ లక్ష్య సాధనే ధ్యేయంగా ముందుకు సాగాలని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. గురువారం సాయంత్రం స్థానిక ద్వారకాపురిలోని అధికారిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ ఖమ్మం, భద్రాద్రి- కొత్తగూడెం జిల్లాల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో సమావేశం నిర్వహించారు.


​ఈ సమావేశంలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ మాట్లాడుతూ... సోషల్ మీడియాలో అనుసరించాల్సిన విధానాలు, ఎదురవుతున్న సవాళ్లపై పలు కీలక అంశాలపై చర్చించారు. ​విజయానికి బాటలు వేసిన వారిని ఎప్పటికీ గుర్తుంచుకోవాలని, కృతజ్ఞతా భావంతో మెలగాలన్నారు. ​లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎదురయ్యే విమర్శలు, నెగెటివ్ కామెంట్లకు నిరుత్సాహపడకుండా మరింత కష్టపడాలని పిలుపునిచ్చారు. ​ప్రజలకు ఎల్లప్పుడూ ఉపయోగపడే వాస్తవ సమాచారాన్ని మాత్రమే సోషల్ మీడియా వేదికగా అందించాలని కోరారు.


​ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి, వారిలో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ అభిప్రాయాలను, అనుభవాలను ఎమ్మెల్యేతో పంచుకున్నారు. ​అనంతరం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ల సేవలను అభినందిస్తూ వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్‌ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్, సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహారావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నారావు, మొహమ్మద్ కమల్ పాషా పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్