- ఉచితంగా ఓటును ఎన్రోల్మెంట్ చేసుకోండి
- మున్సిపల్ చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న మీ-సేవ కేంద్రం వద్ద పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఓటరు నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభించడం జరిగిందని మున్సిపల్ చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్ తెలిపారు. టీపీసీసీ, డీసీసీ, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆదేశాల మేరకు ఈ ఆన్లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవడానికి నవంబర్ 6వ తేదీ వరకు తుది గడువు ఉందన్నారు.
అర్హులైన పట్టభద్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటును ఉచితంగా నమోదు చేసుకోవాలని కోరారు. డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదువు పూర్తి చేసిన అర్హులు నిర్ణీత గడువులోగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పట్టభద్రుల ఓటు హక్కును ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ విజ్ఞప్తి చేశారు. పట్టభద్రుల ప్రయోజనాల కోసం శ్రమించే అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని రెహానా కమల్ కోరారు. స్థానిక పట్టభద్రులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ నమోదు కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని ఆమె పేర్కొన్నారు.






కామెంట్లు (0)