Magazines

జేవీఆర్ కళాశాల 'గోల్డెన్ జూబ్లీ' వేడుకల నిర్వహణకు విశేష స్పందన

2 గంటల క్రితం

JVR
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 2 నిమిషాల చదవడం

- పోటీలుపడి భారీగా విరాళాలు ప్రకటించిన పూర్వ విద్యార్థులు

- కళాశాల 1976-2026 స్వర్ణోత్సవ సన్నాహక సమావేశం

- ఉత్సాహంగా పాల్గొన్న పూర్వ విద్యార్థులు

నవతెలంగాణ-సత్తుపల్లి 

సత్తుపల్లిలో పేరుగాంచిన జలగం వెంగళరావు (జేవీఆర్) ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వర్ణోత్సవ-1976-2026  (గోల్డెన్ జూబ్లీ) సంబురాల సన్నాహక సమావేశం ఆదివారం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. కళాశాలలోని ఆడిటోరియం వేదికగా కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ అధ్యక్షతన, ప్రథమ బ్యాచ్ విద్యార్థి, సంఘం జనరల్ సెక్రటరీ దారా కృష్ణారావు సారధ్యంలో ఈ సన్నాహక సమావేశం జరిగింది.‌ 


కనీవినీ ఎరుగని రీతిలో గోల్డెన్ జూబ్లీ వేడుకలు..

కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ దయానంద్ విజయకుమార్ 

కళాశాల ఏర్పడి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ మూడో వారంలో నిర్వహించే కళాశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించుకుందామని ఆ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘ అధ్యక్షుడు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ స్పష్టం చేశారు. నవంబర్ 8వ తేదీన మరోసారి నిర్వహించే సన్నాహక సమావేశంలో పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని డాక్టర్ దయానంద్ కోరారు. ఆ సమావేశంలో స్వర్ణోత్సవ  వేడుకల కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.


స్వర్ణోత్సవ సంబురాలకు విరాళాల వెల్లువ

​స్వర్ణోత్సవ వేడుకల నిర్వహణకు పూర్వ విద్యార్థులు వేదిక పైనుంచి స్వచ్ఛందంగా విరాళాలు ప్రకటించడం సభలో సరికొత్త స్ఫూర్తిని నింపింది.

వ్యక్తిగత విరాళాలు ప్రకటించిన పూర్వ విద్యార్థులు

పూర్వ విద్యార్థి బలుసు వినయ్ బాబు వ్యక్తిగతంగా రూ. లక్ష విరాళాన్ని ప్రకటించారు. మరికొందరు పూర్వ విద్యార్థులు రూ. 5వేలు మొదలుకొని రూ. 50వేల వరకు వేదిక పైకొచ్చి సభాముఖంగా తమ వంతు విరాళాలు ప్రకటించడంతో సభలో అభినందనలు, హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. 

4వ బ్యాచ్ తరపున భారీ విరాళాన్ని అందజేస్తాం... పూర్వ విద్యార్థి మచ్చా  శ్రీనివాసరావు

​4వ బ్యాచ్ పూర్వ విద్యార్థుల తరఫున మచ్చా శ్రీనివాసరావు మాట్లాడుతూ... తమ బ్యాచ్ విద్యార్థులందరూ కలిసి కళాశాల కోసం భారీ విరాళాన్ని అందజేస్తామని వేదికపై ప్రకటించారు.

4వ వ బ్యాచ్ ఎంత ఇస్తే దానికంటే ఎక్కువ ఇస్తాం... ఫస్ట్ బ్యాచ్ పూర్వ విద్యార్థి... దారా కృష్ణారావు  

4వ బ్యాచ్ పూర్వ విద్యార్థి మచ్చా శ్రీనివాసరావు చేసిన ప్రకటనకు ఫస్ట్ బ్యాచ్  పూర్వ విద్యార్థి దారా కృష్ణారావు స్పందించారు. 4వ బ్యాచ్ వారు ఎంత విరాళం ఇస్తే, ప్రథమ బ్యాచ్ తరఫున అంతకంటే ఎక్కువ మొత్తాన్ని అందజేస్తామని ప్రకటించడం పూర్వ విద్యార్థులందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.


ఈ సన్నాహక సమావేశంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు కళాశాల స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహించేందుకు పూర్వ విద్యార్థుల సంఘం నిర్ణయం తీసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. గోల్డెన్ జూబ్లీ వేడుకలు 

విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పరిచే వివిధ కమిటీలలో  బాధ్యతలు స్వీకరిస్తామని, సభా ముఖంగా పలువురు పుర్వ విద్యార్థులు  ముక్తకంఠంతో ప్రకటించారు.‌


​ఈ సమావేశంలో కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ గుండ్రోతు నరసింహారావు, పూర్వ విద్యార్థులు ఉడతనేని అప్పారావు, నక్కా రాజేశ్వరరావు, ఆర్. శైలకుమారి, స్వర్ణోత్సవ కమిటీ బాధ్యులు జీవీ రమణ, గాదె నరసింహారెడ్డి, మొరిశెట్టి సాంబశివరావు, జి. వెంకట్రామిరెడ్డి, ఎ. శేషగిరిరావు, బత్తిన గీతాకుమారి, గోపిశెట్టి వెంకటేశ్వరరావు, పిల్లి మల్లికార్జునరావు తోపాటు హైదరాబాద్‌లో స్థిరపడిన పలువురు పూర్వ విద్యార్థులు, ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్