Magazines

పూర్వ విద్యార్థులు తరచూ కలుసుకోవాలి

1 గంట క్రితం

Alumni
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 24, 2026 | 1 నిమిషాల చదవడం

- పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలి

- పీఎం శ్రీ ఎంపీయూపీఎస్ ప్రధానోపాధ్యాయులు పున్నం చంద్రశేఖర్ రావు

నవతెలంగాణ - అశ్వారావుపేట

చిన్ననాటి మధుర జ్ఞాపకాలు కలకాలం నిలిచిపోయేలా పూర్వ విద్యార్థులు తరచూ కలుసుకుంటూ ఆత్మీయతను పంచుకోవాలని పీఎం శ్రీ ఎంపీయూపీఎస్ నారంవారిగూడెం ప్రధానోపాధ్యాయులు పున్నం చంద్రశేఖర్ రావు అన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలని, విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలను ఎప్పటికీ మరువకుండా దాని అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని సూచించారు.

శనివారం నారంవారిగూడెం పాఠశాలలో 2005 - 06 విద్యా సంవత్సరంలో ఏడో తరగతి చదివిన 30 మంది పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక నిర్వహించారు.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ చిన్ననాటి స్నేహాలు, పాఠశాల జ్ఞాపకాలు జీవితాంతం మధురానుభూతులుగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ప్రధానోపాధ్యాయులు పున్నం చంద్రశేఖర్ రావును సైతం సత్కరించారు. పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం వేడి, చల్లని నీటిని అందించే డిస్పెన్సర్‌ను బహూకరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థి వనమా గోపి, ఉపాధ్యాయులు బండి శ్రీనివాసరెడ్డి, రేణుక, ఆషిక్, రవిబాబు, మంగమ్మ, రజని, కవిత, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్