Magazines

మద్నూర్, డోంగ్లి, మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి

50 నిమిషాల క్రితం

Madnoor and Dongli mandals should be declared as drought-affected mandals.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026 | 1 నిమిషాల చదవడం

- భారతీయ కిసాన్ సంగ్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో ఫిర్యాదు

నవతెలంగాణ-మద్నూర్

మద్నూర్ ఉమ్మడి మండలంలోని మద్నూర్, డోంగ్లి, ఇరు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ సంగ్ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రాన్ని అందజేశారు. మద్నూర్ మండలంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెరువుల కింద సాగుచేసిన వరి పంటలు నీరు లేక ఎండిపోతున్నాయని కంది పంటకు పూత ఖాతా రావడంలేదని సోయాబీన్ దిగుబడి తగ్గిపోయిందని వర్షాలు లేక రబ్బి పంటలు సాగు చేయడం కష్టంగా మారిందని, బోరు బావులు ఉన్న రైతులకు సైతం సరిపడ నీరు అందడం లేదని, అప్పులు చేసి బోర్లు వేయించుకున్నప్పటికీ కొందరికి నీరు పడడం లేక వ్యవసాయానికి ఎనిమిది గంటల విద్యుత్ సరఫరా కూడా అందడం లేదని, పశుగ్రాసం కొరత కారణంగా రైతులు మరింత నష్టపోవాల్సి వస్తుందని, కౌలు రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాక అప్పుల భారంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పంట నష్టాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ,మద్నూర్ డోంగ్లి మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని, మండల స్థాయి అధికారులు సంబంధిత ఉన్నతాధికారులకు నివేదించి, అర్హులైన రైతులకు పంట నష్టపరిహారం ఆర్థిక సాయం అందించేలా చూడాలని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ వినతి పత్రం అందజేత కార్యక్రమంలో భారతీయ కిసాన్ సాంగ్ మండల అధ్యక్షులు కుషాల్ ప్రధాన కార్యదర్శి హనుమంత్ రావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్