Magazines

'మలబార్' లో సామాజిక బాధ్యత 

1 గంట క్రితం

Malabar
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - నిజామాబాద్ సిటీ

మలబార్ గ్రూప్ 34వ వార్షికోత్సవ సందర్భంగా నగరం లోని వినాయక నగర్ ప్రాంతం లో గల అమరవీరుల పార్కులో సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ స్టోర్ హెడ్ అక్షయ్, షోరూం మేనేజర్ ప్రశాంత్, ఫెరోజ్ ఆధ్వర్యంలో చెత్త సేకరణ నిర్వహించారు.


ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ..మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పీ. అహమ్మద్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. పర్యావరణ బాధ్యత, సామాజిక నిబద్ధత, పారదర్శకత, నైతిక పాలనను తమ వ్యాపార కార్యకలాపాల్లో అంతర్భాగం చేసుకున్నామని, సమాజానికి తిరిగి సేవ చేయడానికి తమ సంస్థ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.


పర్యావరణ పరిరక్షణ భాగంగా వచ్చే ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా సుమారు లక్ష మొక్కలను నాటాలని గ్రూప్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ, పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా సంస్థ నిరంతరం సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ ఇమ్రాన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్