Magazines

ఆధ్యాత్మిక శోభలో అమీన్‌పూర్

1 గంట క్రితం

Aminpur
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 2 నిమిషాల చదవడం

దిగ్విజయం చేసిన మాజీ చైర్మన్ తుమ్మల
నవతెలంగాణ - అమీన్‌పూర్
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ డివిజన్ కేంద్రంలో దసరా శరన్నవరాత్రోత్సవాల ముగింపు ఘట్టం అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక కోలాహలం నడుమ ముగిసింది. అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో టిపిఆర్ యువసేన నేతృత్వంలో నిర్వహించిన శ్రీ దుర్గా భవానీ అమ్మవారి శోభాయాత్ర, నిమజ్జన మహోత్సవం స్థానిక భక్తులకు కంటికి రెప్ప వేయనంత కన్నులపండువగా సాగింది. ఈ ఆధ్యాత్మిక వేడుకకు పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన సాంస్కృతిక కళాకారుల ప్రదర్శనలు, పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లు, మహిళల ఆధ్యాత్మిక కోలాటాలు, భక్తుల ఆటపాటలు శోభాయాత్రకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అమీన్‌పూర్ వీధులన్నీ దుర్గామాత నామస్మరణతో మార్మోగిపోయాయి.

ధర్మానికి, శక్తికి నిదర్శనం దుర్గామాత ఆరాధన: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ‘దసరా పండుగ అంటేనే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. మన సంస్కృతి, సంప్రదాయాలకు ఇటువంటి ఉత్సవాలు నిలువుటద్దాలు. శరన్నవరాత్రులు ప్రజల్లో భక్తిభావాన్ని పెంచడమే కాకుండా, సమాజంలో ఐక్యతను, సోదరభావాన్ని మరింత బలోపేతం చేస్తాయి. అమ్మవారి దివ్య ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.’ అని చెప్పుకొచ్చారు.

ఉత్సవాన్ని దిగ్విజయం చేసిన ప్రజలకు ధన్యవాదాలు: తుమ్మల పాండురంగారెడ్డి
కార్యక్రమ నిర్వాహకులు తుమ్మల పాండురంగారెడ్డి మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో అమీన్‌పూర్ పట్టణంతో పాటు చుట్టుపక్కల కాలనీల ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. తమ పిలుపునందుకొని శోభాయాత్రకు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేసిన ప్రతి ఒక్క భక్తుడికి, స్థానిక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీఆర్ యువసేన సభ్యులు, మహిళలు, యువకులు, వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్