Magazines

మిషన్ భగీరథ పైపు పగిలి నీరు వృధా

1 గంట క్రితం

water wasted
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - తొగుట : మిషన్ భగీరథ పైపు పగిలి నీరు వృధా అవుతుంది. ఆదివారం మండలంలో వెంకట్రావుపేట నుండి చందాపూర్, రాంపూర్ వెళ్లే మార్గంలో మిషన్ భగీరథ పైపులైన్ పదే పదే పగులుతుం డటంతో వేల లీటర్ల తాగునీరు వృధాగా పోతోంది. 15 రోజుల్లోనే మూడు, నాలుగు సార్లు పైపు పగిలి, పొలాల్లోకి నీరు చేరుతుంది. పగిలిన చోట నుండి నీరు ఎగజిమ్ముతూ కాలువల్లోకి వెళ్తుంది. దాని వల్ల వరి పంట పూర్తిగా నష్టం వాటిల్లుతుంది. మిషన్ భగీరథ అధికారులు తాత్కాలిక మరమ్మ తులు చేసి వెళ్తున్నారని, శాశ్వత పరిష్కారం చూప డం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఒక పక్క తాగునీటికి ఇబ్బందులు ఉంటే, మరో పక్క ఇలా నీరు వృధా అవ్వడం బాధాకరమని ఆయా గ్రామా ల ప్రజలు మండిపడుతున్నారు. దీనివల్ల పంట పొలాలు పూర్తిగా దెబ్బతింటుందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, నాణ్యమైన పైపులతో శాశ్వత మరమ్మతులు చేపట్టాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్