Magazines

ముందు చూపులేని ట్రిపుల్ ఐటీ యాజమాన్యం..!         

1 గంట క్రితం

Triple IT management with no vision..!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ -ముధోల్ : నిత్యం ఏదో ఒక సమస్యతో బాసర ట్రిపుల్ ఐటీ అప్రతిష్ట పాలవుతున్న ట్రిపుల్ ఐటీ యాజమాన్యం మాత్రం చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వ్వవహరించటంపై  సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ట్రిపుల్ ఐటీ లో నీటి కోరతతో  విద్యార్థులకు దసరా సెలవులు పొడిగించి, ఆన్లైన్ తరగతులు ప్రారంభిస్తామని చెప్పి ట్రిపుల్ ఐటీ యాజమాన్యం మామా అనిపించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.  ఒకపక్క తెలంగాణ ప్రభుత్వం ఎల్ నినో ప్రభావం వల్ల  ఎదుర్కోబోతున్న సమస్యను తెలుపుతు ప్రచారాన్ని చేపట్టినప్పటికీ, ట్రిపుల్ ఐటీ యాజమాన్యం మాత్రం విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని తాగునీటికి తీసుకోవాల్సిన చర్యల గురించి పట్టనట్లు వ్యవరించడంపై విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు మండిపడుతున్నారు. ట్రిపుల్ ఐటీ కి బాసర గోదావరి నుండి ఇంటెక్ వెల్ ద్వారా మోటార్ల సాయంతో  గోదావరి నీటిని ట్రిపుల్ ఐటీలో గల చెరువుని నింపుతుంటారు. అయితే కొన్ని రోజులుగా ఇంటెక్ వెల్ లో రెండు మోటార్లు పనిచేయటం లేదని సమాచారం. అయితే విద్యార్థులకు దసరా సెలవులు ఉండటంతో ఈ సమస్యను సంబంధిత అధికారులు కూడా పట్టించుకోలేదు. నీటి కొరత ఉన్నట్లు అధికారులు ఆఖరి వరకు గుర్తించకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం ఎల్ నినో ప్రభావం వల్ల ఎదుర్కోబోయే తాగునీరు, సాగునీరు, కరెంట్ కష్టాలను, రాష్ట్ర మంత్రులు తోపాటు, ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రకటనలు జారీ చేస్తున్నప్పటికీ  ట్రిపుల్ ఐటీ యాజమాన్యం పేడచేవిన పెట్టండంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  నిరంతరం ట్రిపుల్ ఐటీలో నీటి కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం విద్యార్థుల పాలిట శాపంగా మారిందని పలువురు పేర్కొంటున్నారు. విద్యార్థుల చదువుపై తల్లిదండ్రుల ఆందోళన చెందుతున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం  స్పందించి ట్రిపుల్ ఐటీలో నీటి కోరత లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్