Magazines

కాంగ్రెస్ పాలనలో అధికారుల నిర్లక్ష్యం

2 గంటల క్రితం

Negligence of officials during Congress rule
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - కడ్తాల్ : కడ్తాల్ మండలంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తారు. కానీ అధికారులు మాత్రం తూతూ మంత్రంగా వచ్చి సంతకాలు చేసి వెళ్లిపోతారు. కాంగ్రెస్ పాలనలో అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన దుస్థితి ఏర్పడింది. ఈ కార్యక్రమానికి ప్రతి డిపార్ట్మెంటు నుండి అధికారులు హాజరు కావాలి. కానీ ఇక్కడ అధికారులు హాజరు కాకపోవడం పట్ల మండల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సమస్యల కోసం అధికారులు కలవడానికి వస్తే అధికారులు ఎవరూ కలవడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. కొంతమంది అధికారులు మాత్రమే హాజరవుతున్నట్లు తెలుస్తుంది. ప్రజావాణి కి హాజరు కాని అధికారుల పైన కలెక్టర్ స్పందించి వారిని సస్పెండ్ చేయాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్