Magazines

ప్రజల ఆరోగ్యమే మా ప్రథమ ప్రాధాన్యత: సర్పంచ్ గ్యార కవిత..

12 నిమిషాల క్రితం

2183628
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం

- మెడిసిటీ ఆస్పత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరం

నవతెలంగాణ – ఆలేరు రూరల్ : ప్రజల ఆరోగ్యమే తమ ప్రథమ ప్రాధాన్యతని సాయిగూడెం గ్రామ సర్పంచ్ గ్యార కవిత అన్నారు.గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రాఘవ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో, మెడిసిటీ ఆస్పత్రి సహకారంతో సోమవారం ఆలేరు మండలం సాయిగూడెం గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ శిబిరంలో వైద్యులు గ్రామ ప్రజలకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సమస్యలను గుర్తించి తగిన వైద్య సలహాలు అందించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.వైద్య పరీక్షల్లో శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించిన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయించేందుకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.అనంతరం సర్పంచ్ గ్యార కవిత మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు.అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో ఇలాంటి శిబిరాలు నిర్వహించడం గొప్ప సేవా కార్యక్రమమని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు గ్రామ పంచాయతీ తరఫున ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాఘవ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు గ్యాదపాక సునీత మల్లేష్,ఉపసర్పంచ్ భయ్యా జ్ఞానేందర్,సాయిగూడెం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు భీమగాని వెంకటేష్ గౌడ్,వార్డు సభ్యులు భీమగాని ప్రియాంక,రాజు,గజ్జల శేఖర్, ముద్దేపాక శుశీలమ్మ,గ్రామ పాలకవర్గ సభ్యులు,గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్