నవతెలంగాణ-కుభీర్
మండలంలోని ఫార్డి కే గ్రామంలో దక్షణ హనుమాన్ ఆలయంలో ఆదివారం గ్రామస్తులు వేద పండితులతో కలసి తాళ సప్తమి వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ఈ వేడుకలు ఏడు రోజుల పాటు మందిరంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆయా గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు చేపట్టినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అదేవిధంగా ప్రతిరోజు రాత్రి 9 గంటల నుండి కీర్తనకారులచే భక్తి కీర్తనలను ఆధ్యాత్మిక ప్రవచనాలు, భజన కార్యక్రమాలు ఆలపించనున్నారు.ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
ఫార్డి కే గ్రామంలో సప్తమి వేడుకలు ప్రారంభం
01 నవంబర్, 2026

Shiva Kumar
ప్రచురించబడింది నవం 01, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)