నవతెలంగాణ-మద్నూర్
మండల పరిధిలోని పెద్ద తడుగూరు గ్రామంలో తాగునీటి ఎద్దడి నివారణలో భాగంగా ముందస్తుగా సింగిల్ ఫేస్ మోటర్ ను గురువారం సర్పంచ్ శాంతవ్వ ఈరన్న ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..ప్రస్తుతం ఎల్నీనో ప్రభావంతో నీటి ఎద్దడి పొంచి ఉందనీ, రానున్న రోజుల్లో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా బోరు మోటారు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ మేరుకు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల పనితీరుకు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రావణి హనుమగౌడ్, వార్డు సభ్యులు సుభాష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.







కామెంట్లు (0)