Magazines

కేటీఆర్‌పై ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న కొండా సురేఖ

1 గంట క్రితం

KTR
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్:

హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం కేటీఆర్‌కు అలవాటని, టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ జంట విడిపోడానికి కేటీఆరే కారణమని మాజీ మంత్రి కొండా సురేఖ గతంలో ఆరోపణలు చేసి విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై కొండా సురేఖ మరోసారి స్పందించారు. గతంలో చేసిన ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు తాజాగా ట్వీట్ చేశారు.


ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు.. నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది.. కేటీఆర్, ఆయన కుటుంబాన్ని బాధపెట్టాలనే ఉద్దేశం లేదు.. కేటీఆర్ ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం లేదు.. నా వ్యాఖ్యలతో వారిని నొప్పించి ఉంటే అందుకు చింతిస్తున్నా.. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా అంటూ కొండా సురేఖ ట్వీట్‌లో స్పష్టం చేశారు.


సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కూతురు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆమెను మంత్రి పదవి నుంచి బర్తరప్ చేసిన విషయం తెలిసిందే. ఆమె తాజాగా వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారాయి.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్