Magazines

బ్యాలెట్ ద్వారా బీజేపీకి బుల్లెట్ దింపాం: టీపీసీసీ చీఫ్

1 గంట క్రితం

TPCC CHIEF
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: "ఎన్ని గెలిచామన్నది కాదు, ఎక్కడ గెలిచామన్నది ముఖ్యం. బీజేపీ అబ్బ అయిన ఆర్‌ఎస్‌ఎస్ హెడ్‌క్వార్టర్స్‌లోనే బీజేపీని ఓడించి, బ్యాలెట్ ద్వారా బుల్లెట్ దింపాం" అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఆయన గురువారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ నియోజకవర్గమైన వారణాసి, ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగ్‌పూర్‌లలో బీజేపీ ఓటమిని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.

నాగ్‌పూర్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి అభిజిత్‌ వంజారి, బీజేపీ అభ్యర్థి సుధాకర్‌ కోహ్లేపై 3,271 ఓట్ల తేడాతో విజయం సాధించారని మహేశ్ గౌడ్ గుర్తుచేశారు. బీజేపీకి కంచుకోటలాంటి, కేంద్ర మంత్రి గడ్కరీ, ఫడ్నవీస్ వంటి నేతలు ప్రచారం చేసిన నాగ్‌పూర్‌లో కాంగ్రెస్ గెలవడం సాధారణ విషయం కాదన్నారు. ఇది బీజేపీ సిద్ధాంతాన్ని అక్కడి విద్యావంతులు, యువత తిరస్కరించడానికి నిదర్శనమని పేర్కొన్నారు.


వారణాసిలో ఓటమి మోడీ పాలనపై ప్రజా వ్యతిరేకతను సూచిస్తోందని, ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ మోడీ తన వైఫల్యాలను అంగీకరించాలని డిమాండ్ చేశారు. ధైర్యముంటే ఈ ఫలితాలపై మోడీ ప్రెస్ మీట్ పెట్టాలని, గత 12 ఏళ్లుగా ఒక్క మీడియా సమావేశం కూడా నిర్వహించని ప్రధాని కేవలం ట్వీట్లకు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఓడిపోతే ప్రభుత్వ వ్యతిరేకత అనే బీజేపీ, వారణాసిలో ఓటమిని ఎందుకు మోడీకి వ్యతిరేకంగా చూడొద్దని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్