Magazines

విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి: సర్పంచ్

1 గంట క్రితం

distribution
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్ 

మండల కేంద్రంలోని సేఠ్ రాం ప్రసాద్ ఇనాని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం విద్యార్థులకు సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రీ ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. విద్య అభివృద్ధికి ప్రజా పాలన ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని తెలిపారు. రైజింగ్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా ఇంటర్మీడియట్ ఆఫ్ ఎడ్యుకేషన్ బోర్డు ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకునే 296 మంది విద్యార్థులకు దుస్తులు అందజేయడం జరిగిందని ప్రిన్సిపాల్ పాండురంగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వట్నాల్ రమేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్