Magazines

వ్యవసాయ మార్కెట్లో కోతుల స్వైర విహారం 

1 గంట క్రితం

Monkeys
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరుటౌను

ఆలేరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో కోతులు స్వైర విహారం చేస్తున్నాయి. మార్కెట్లో ఉన్న అధికారులపై, సిబ్బందిపై దాడి చేస్తున్నాయి. రైతులపై, లారీ డ్రైవర్, క్లీనర్లపై ఎగబడుతూ భయభ్రాంతుల గురి చేస్తున్నాయి. వందల సంఖ్యలో కోతులు వచ్చి చేరడంతో మార్కెట్కు రావాలంటేనే రైతులు, సిబ్బంది, డ్రైవర్లు, క్లీనర్లు జంకుతున్నారు. ధాన్యం కొనుగోలు ప్రారంభమైన నేపథ్యంలో హమాలి కార్మికులు మార్కెట్లో పనిచేయాలంటే కోతులని, సంబంధిత అధికారులు  పట్టుకొని దూరం అడవి ప్రాంతంలో వదలాలని కోరుతున్నారు.


ఇటీవల మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్, కమిషనర్ కే శ్రీనివాస్ రెడ్డి, అధికారులతో కలిసి కోతులను పట్టి బయటకు పంపే ప్రయత్నం చేపట్టినప్పటికీ , కొన్ని కోతులు తప్పించుకొని పారిపోయాయి. మరికొన్ని కోతులు ఇతర ప్రాంతాల నుండి ఆలేరు పట్టణానికి చేరుతున్నాయి. కోతుల నిర్మూలనకు తక్షణ చర్యలు తీసుకోవాలని , మార్కెట్ అధికారులు, హమాలీ కార్మికులు సిబ్బంది  పట్టణ ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్