Magazines

కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందన

1 గంట క్రితం

KTR
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: మాజీ మంత్రి కొండా సురేఖ ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మాజీ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఇంకా చూడలేదని, చూశాక లీగల్‌ టీమ్‌తో చర్చిస్తానని చెప్పారు. నిజం నిలకడ మీద తేలుతుందని పెద్దలు ఎప్పుడో చెప్పారు.. ఇంకా క్షమాపణలు చెప్పేవాళ్లు చాలా మంది ఉన్నారని కేటీఆర్‌ వ్యాఖ్యనించారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ దూది పింజల్లా తేలిపోతాయన్నారు.


తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ… ఇవాళ అధికారుల నుంచి మాకు అందుతున్న స‌మాచారం ప్ర‌కారం మూసీ ప్రాజెక్టు ముసుగులో వేలాది ఎక‌రాల లూటీకి ఈ ముఖ్య‌మంత్రి తెర‌లేపారు.. అందుకే ప‌బ్లిక్ హియ‌రింగ్ అంటే ఉలిక్కి ప‌డుతున్న‌రు.. అందుకే ప‌బ్లిక్ హియ‌రింగ్ అంటే ఉలిక్కి ప‌డుతున్న‌రు.. భ‌య‌పడుతున్న‌రు.. ప‌బ్లిక్ రాకుండా తూతూ మంత్రంగా ఏదో చేశామంటే చేశామ‌నిపించుకోవ‌డానికి ఒక ప్రొసీజ‌ర‌ల్ ఇష్యూలాగా చాప కింద తోసేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్