నవతెలంగాణ-సత్తుపల్లి
నిత్యం వార్తల సేకరణ, ప్రజా సమస్యల వెలికితీతలో బిజీగా ఉండే పాత్రికేయులు ఒకచోట చేరి ఆత్మీయంగా గడిపారు. పరస్పర అభిమానం, ఆప్యాయతలను పంచుకుంటూ ఐక్యతను చాటుకున్నారు. సత్తుపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మండలంలోని బేతుపల్లిలోని చీపు చెన్నయ్య మామిడి తోటలో సోమవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అభివృద్ధి, పాత్రికేయుల సంక్షేమం, సభ్యుల మధ్య సమన్వయం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, వృత్తిపరంగా ఎదురయ్యే సవాళ్లను ఐక్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించారు. సభ్యులంతా పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
పూర్తిస్థాయిలో నూతన కార్యవర్గం కూర్పు
ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా తడికమళ్ల దేవదానం, ప్రధాన కార్యదర్శిగా చీపు గంగాధర్ ఈనెల మొదటి వారంలో ఎన్నికయ్యారు. తాజాగా మిగిలిన కార్యవర్గ స్థానాలకు ఎన్నికల ప్రక్రియను బేతుపల్లిలో ఏర్పాటుచేసిన సమావేశంలో క్లబ్ పూర్తిస్థాయి కూర్పును భర్తీ చేశారు. దీంతో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో పూర్తిస్థాయి నూతన కమిటీ ఏర్పాటైంది.
సత్తుపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఇలా...
అధ్యక్షుడిగా తడికమళ్ల దేవదానం, ప్రధాన కార్యదర్శి జీఆర్ గౌడ్ (చీపు గంగాధర్) ఉపాధ్యక్షులుగా బేతి ఆనంద్, కొత్తపల్లి సుధాకర్, కోశాధికారిగా వబిలిశెట్టి రామారావు,
సహాయ కార్యదర్శులుగా మారోజు అశోక్ కుమార్, ఎస్.కె బాజీ, ప్రచార కార్యదర్శిగా బొల్లిపోగు సురేష్, సహాయ ప్రచార కార్యదర్శిగా అబ్దుల్ మెహరాజ్ ఎన్నికయ్యారు.
జర్నలిస్టుల సంక్షేమానికి నూతన కార్యవర్గం కృషి చేయాలి
కొత్తగా బాధ్యతలు చేపట్టిన సత్తుపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం జర్నలిస్టుల సంక్షేమాభివృద్ధికి కృషి చేయాలని సమావేశంలో పలువురు జర్నలిస్టులు కోరారు. పదవులను హోదాలుగా కాకుండా బాధ్యతలుగా భావించి, సభ్యులందరినీ కలుపుకొని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు మాదిరాజు సుధాకర్, ఎండి. సైబుద్దీన్, భీమిశెట్టి రాము, చీనేని బాలకృష్ణ, రామిశెట్టి లక్ష్మణరావు, రాజేష్ రెడ్డి, శీలం శ్రీనివాసరెడ్డి, కొర్ర బాలాజీ, రేగళ్ల విజయభాస్కరరెడ్డి, నల్లంటి మోహన్, కొవ్వూరి సాంబ, యనమాల విజయ్, కాకర్ల జగన్, జీడిమళ్ల శ్రీనివాసరావు, గోదా విష్ణు, ఎస్.కె. మీరా, రామిశెట్టి రమేష్, కేసన తరుణ్ పాల్గొన్నారు.






కామెంట్లు (0)