మార్కెట్  చైర్మన్‌గా సుధాగాని మల్లేష్ గౌడ్ బాధ్యతల స్వీకరణ

19 నిమిషాల క్రితం

Market Chairman
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం

పాలకవర్గం ప్రమాణ స్వీకారం
18 మందితో పాలకవర్గం ఏర్పాటు

నవతెలంగాణ-ఆలేరు టౌను

ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నతన చైర్మన్గా సుధాగాని మల్లేష్ గౌడ్ సభా వేదికపై తోటి సభ్యులతో కలిసి ప్రమాణం చేసి, బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా పాలకవర్గ సభ్యులు కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సమక్షంలో జిల్లా మార్కెటింగ్ అధికారి సారంగపాణితో 

నూతన పాలకవర్గ సభ్యులు ప్రమాణం చేశారు.


మార్కెట్ కమిటీ ఏడో పాలకవర్గం చైర్మన్‌గా ఆత్మకూరు మండలానికి చెందిన సుదగాని మల్లేశ్ గౌడ్, వైస్ చైర్మన్‌గా ఆలేరు పట్టణానికి చెందిన ఎంఏ ఎజాజ్‌ బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మార్కెటింగ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన  మేరకు వ్యవసాయ, సహకార శాఖ జీఓ ఆర్‌టీ నంబర్ 811ను నవంబర్ 17, 2026న విడుదల ప్రకారం చైర్మన్ పదవిని బీసీ జనరల్ కేటగిరీకి రిజర్వ్  కాగా.. నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గంలో మొత్తం 18 మందికి అవకాశం కల్పించారు.


వీరిలో చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు 16 మంది సభ్యులు ఉంటారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ పాలకవర్గం పదవీకాలం ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి రెండేళ్ల పాటు కొనసాగనుంది. ఇటీవల వరకు ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా, ఐనాల చైతన్య మహేందర్ రెడ్డి కమిటీ సభ్యులకి వీడ్కోలు పలికారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్