నవతెలంగాణ-హైదరాబాద్: ఐపీఎల్-2027 సీజన్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ మేనెజ్మెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మను మరోసారి ఎంపిక చేసింది. ఈ మేరకు ముంబై ఇండియన్స్ మేనెజ్మెంట్ ఎక్స్ వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. గత సీజన్ వరకు ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇటీవల అతడు పంజాబ్ కింగ్స్‌కు ట్రేడ్ కావడంతో రోహిత్‌కు తిరిగి జట్టు పగ్గాలను ఎంఐ యాజమాన్యం కట్టబెట్టింది. రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై జట్టును ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. అయితే 2024 సీజన్‌కు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
ముంబై ఇండియన్స్ యజమాన్యం కీలక నిర్ణయం
22 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)