నవతెలంగాణ - భీంగల్
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ బోదిరే నాగమణి స్వామి తెలిపారు. భీంగల్ పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కార్యక్రమాన్ని పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ బోదిరే నాగమణి స్వామి అన్నారు.
పట్టణంలోని వివిధ వార్డులలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కార్యక్రమం కొనసాగుతుండగా, ఈ సందర్భంగా లబ్ధిదారులకు దరఖాస్తు పత్రాలను అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకంపై అవగాహన కల్పించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు వినియోగించుకునేలా అధికారులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ప్రజల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే ఈ కార్యక్రమంలో అర్హులైన ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చైర్ పర్సన్ కోరారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ నరేందర్ వార్డ్ ఆఫీసర్ బండి రాజేశ్వర్. మీసాల రాజేశ్వర్ మున్సిపల్ అధికారులు, సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)