ఆన్సాన్పల్లిలో అభివృద్ధి పనులకు భూమిపూజ

1 గంట క్రితం

Groundbreaking
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - మల్హర్ రావు

మండలంలోని ఆన్సాన్పల్లి గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ గుగులోతు మంజుల-జగన్ నాయక్ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా విబిజి రాంజి నిధులతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణం కోసం రూ.30 లక్షలు, అంగన్ వాడి కేంద్రం-1కు నూతన భవన నిర్మాణం కోసం రూ.12 లక్షల నిధులతో పాలకవర్గంతో కలిసి భూమిపూజ నిర్వహించారు.


నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, వేగవంతంగా పూర్తి చేయాలని సర్పంచ్ ఆదేశించారు. అడుగగానే నిధులు మంజూరు చేసిన మంత్రి శ్రీదర్ బాబుకు సర్పంచ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గం,జీపీ కార్యదర్శి,ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్