Magazines

జిల్లాస్థాయి పోటీల్లో టీజీ ఎంఆర్ఎస్ విద్యార్థినుల ప్రతిభ

12 గంటల క్రితం

TG MRS students
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 18, 2026 | 1 నిమిషాల చదవడం

- ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ పోటీల్లో పలు బహుమతులు

- విజేతలను అభినందించిన ప్రిన్సిపాల్ తూము సంగీత

నవతెలంగాణ - అశ్వారావుపేట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయిలో నిర్వహించిన ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ పోటీల్లో అశ్వారావుపేట టీజీ ఎంఆర్ఎస్ అండ్ జేసీ బాలికల - 1 విద్యార్థినులు ప్రతిభ చాటారు. వివిధ విభాగాల్లో పాల్గొని బహుమతులు సాధించి విద్యాసంస్థకు గుర్తింపు తీసుకొచ్చారు.

ఇంటర్మీడియట్ స్థాయిలో నిర్వహించిన క్విజ్ పోటీల్లో ఎస్.కె. నాజియా ప్రథమ బహుమతి సాధించగా, వ్యాసరచన పోటీల్లో పి. అంజలి ప్రథమ బహుమతి కైవసం చేసుకున్నారు.


పాఠశాల స్థాయిలో 9వ తరగతికి చెందిన ఎస్.కె. అఫ్సా వ్యాసరచన పోటీలో ప్రథమ బహుమతి సాధించింది. 10వ తరగతికి చెందిన ఐ. రోహిత క్విజ్ పోటీలో ఐదవ బహుమతి పొందగా,ఎస్.కె. హఫ్సా, ఐ. రోషిహా కూడా ఐదవ బహుమతులు సాధించారు.

విజేతలకు జిల్లా జాయింట్ కలెక్టర్ డి. వేణుగోపాల్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ తూము సంగీత, ఉపాధ్యాయ బృందం విద్యార్థినులను అభినందించారు. పోటీలకు విద్యార్థినులను సిద్ధం చేసి మార్గదర్శకత్వం వహించిన ఉపాధ్యాయుల కృషిని ప్రశంసించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్