Magazines

కామారెడ్డి ప్రజల చిరకాల కోరికకు కార్యరూపం

16 నిమిషాల క్రితం

Kailash Prasthan
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

-  సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో ‘కైలాస ప్రస్థానం’ నిర్మాణ పనులు ప్రారంభం

నవతెలంగాణ - కామారెడ్డి

కామారెడ్డి పట్టణ ప్రజల చిరకాల కోరిక త్వరలో నెరవేరనుంది. అంతిమ సంస్కారాల సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రముఖ దాత, సామాజిక సేవకుడు తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ‘కైలాస ప్రస్థానం’ పనులు ఘనంగా మంగళవారం ప్రారంభమయ్యాయి. సమాజ సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే సుభాష్ రెడ్డి, ప్రజలకు ఉపయోగపడేలా ఆధునిక హంగులతో ఈ ప్రాంగణాన్ని నిర్మిస్తున్నారు.


అంతిమ సంస్కారాలకు వచ్చే ప్రజలు, దూర ప్రాంతాల నుంచి హాజరయ్యే బంధువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒకే ప్రాంగణంలో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. ఈ కైలాస ప్రస్థానంలో ఆధునిక స్నానపు గదులు, పరిశుభ్రమైన వాష్‌రూమ్‌లు, అంత్యక్రియల ఆచారాల కోసం ప్రత్యేక కటింగ్ సెలూన్లు, నిర్వహణకు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే బంధువులు విశ్రాంతి తీసుకునేందుకు గెస్ట్‌హౌస్, భోజన సౌకర్యం కోసం క్యాంటీన్‌ను  నిర్మించనున్నారు.


ఈ వసతులన్నీ అందుబాటులోకి వస్తే అంతిమ సంస్కారాల సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ప్రజల అవసరాలను గుర్తించి ఇంతటి బృహత్తర సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డిపై పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్